
ఉక్రెయిన్ పై సైనిక దాడులు చేస్తున్న రష్యాకు దెబ్బ మీద దెబ్బ తగలుతుంది. ఇప్పటికే అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అదే విధంగా రష్యా దుశ్చర్యకు గురి అవుతున్న ఉక్రెయిన్‌కు క్రీడాలోకం కూడా మద్దతుగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్ నుంచి రష్యాపై ఫిఫా బహిష్కరణ వేటు వేసింది. ఫిఫా ప్రపంచకప్-2022తో పాటు అన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి.
ఈ ఏడాది చివర్లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్ కోసం రష్యా పురుషుల జట్టు మార్చిలో క్వాలిఫైయింగ్ ప్లే-ఆఫ్‌లలో పోలాండ్‌తో ఆడాల్సి ఉంది. పోలాండ్ ఫుట్‌బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఇంగ్లాండ్‌లో జూలైలో జరగనున్న యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రష్యా మహిళల జట్టు ఆడనుంది. ఫుట్‌బాల్ జట్లపై ఫిఫా, యూఈఎఫ్‌ఏ నిషేధం విధించడం రష్యాకు పెద్ద ఎదరుదెబ్బ తగిలినట్లైంది. అదే విధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment