పాలెర్మో: నాలుగుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్ ఇటలీ మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ప్లే–ఆఫ్ సెమీఫైనల్లో ఇటలీ 0–1తో నార్త్ మెసెడోనియా చేతిలో పరాజయం చవిచూసింది. ఇటలీ ఫుట్‌బాల్ ప్రియుల్ని అత్యంత నిరాశపరిచే ఫలితమిది. ‘యూరో చాంపియన్’ అయిన ఇటలీ వరుస ప్రపంచకప్‌లకు దూరమవడం అభిమానుల్ని నిర్ఘాంతపరుస్తోంది.
2018లోనూ ఈ మేటి జట్టు క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. నార్త్ మెసెడోనియాతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగింది. అయితే మ్యాచ్ ముగిసే దశలో ఎమరుపాటుగా ఉన్న ఇటలీ డిఫెన్స్‌ని ఛేదించి ట్రాజ్‌కొవ్‌స్కీ ఇంజ్యూరీ టైమ్ (90+2వ ని.)లో చేసిన గోల్‌తో నార్త్ మెసెడోనియా విజయం సాధించింది. దీంతో ఇటలీ శిబిరం నిరాశలో కూరుకుపోయింది.
ఈక్వెడార్, ఉరుగ్వేలకు బెర్త్
మరోవైపు అర్జెంటీనా, బ్రెజిల్ తర్వాత దక్షిణ అమెరికా జోన్ నుంచి తాజాగా ఈక్వెడార్, ఉరుగ్వే ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. పరాగ్వేతో మ్యాచ్‌లో ఈక్వెడార్ 1–3తో ఓడిపోగా... మరోమ్యాచ్‌లో ఉరుగ్వే 1–0తో పెరూపై విజయం సాధించింది. ఉరుగ్వే, ఈక్వెడార్ 25 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌కు అర్హత పొందాయి.
చదవండి: IPL 2022:క్రికెట్ పండగొచ్చింది.. కోల్‌కతా, చెన్నై సమరానికి సిద్దం
Comments
Please login to add a commentAdd a comment