బక్రీద్ పండుగకు మహానగరం ముంబై సిద్ధమైంది.
సాక్షి, ముంబై: బక్రీద్ పండుగకు మహానగరం ముంబై సిద్ధమైంది. వరుస వర్షాలతో తడిసిముద్దైన ముంబైలోని డియోనర్ వధశాలకు పండుగ సందర్భంగా వేలాది మేకలు వచ్చాయి. అయితే, రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ మేక మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అందుకు కారణం దాని ధరే. అక్షరాలా రూ. కోటి ఏడువందల ఎనభై ఆరు రూపాయలకు ఆ మేకను అమ్మకానికి పెట్టారు దాని యజమాని. మేకకు ఇంత భారీ రేటు పెట్టడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. మేక మెడ ప్రాంతంలో అరబ్‌లో అల్లా సింబల్‌ను పోలిన గుర్తులు ఉన్నాయి. దీంతో ఈ మేక పవిత్రమైనదిగా భావిస్తున్నారు.
మేక గురించి మాట్లాడిన యజమాని సోహైల్.. ప్రస్తుతం మేక వయసు 15 నెలలని చెప్పారు. దానికి ఉన్న ప్రత్యేకత రీత్యానే భారీ ధరకు అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. మార్కెట్‌కు వచ్చిన వారందరూ మేకను విచిత్రంగా చూస్తున్నారే తప్ప కొనడానికి మాత్రం వెనుకాడుతున్నారని అన్నారు. అందుకే ధరను సగం తగ్గిస్తున్నట్లు తెలిపారు.