తుర్కపల్లి
లారీ అదుపుతప్పి గొర్రెల మందపై దూసుకెళ్లింది. ప్రమాదంలో 40 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 గొర్రెలు, ఇద్దరు కాపరులకు గాయాలయ్యాయి. ఈ ఘటన తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రనికి చెందిన లారీ ఆలుగడ్డ లోడ్‌తో మహా రాష్ట్ర నుంచి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మీదుగా భువనగిరి వైపునకు వెలుతోంది. రుస్తాపూర్ గ్రామం శివారు ప్రాంతం నుంచి గొర్రెల మందతో వస్తున్న పెద్దతండాకు చెందిన ధీరావత్‌బీమ్లా తన చిన్నమ్మ ధీరావత్ కేళీతో కలిసి ఇంటికి వస్తున్నారు.
ఈ క్రమం లో గ్రామ శివారులోకి రాగానే వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి గొర్రెలమందపైకి దూసుకొచ్చింది. 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరులు బీమ్లా, కేళీలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భువనగిరి నుంచి జగదేవ్‌పూర్ వరకు రోడ్డు రక్తసిక్తమైంది. ప్రమాదం జరగగానే డ్రైవర్ పరారుకావడంతో క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పమాదానికి నిద్రమత్తే కారణం
ప్రమాదానికి నిద్రమత్తే కారణమని స్థానికులు పేర్కొన్నారు. లారీలో మ ద్యం సీసాలతో పాటుగా మాంసహారం కూడా ఉంది. క్లీనర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలపలేక పోతున్నాడని తెలి పారు. ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గొర్రెలమందపైకి దూసుకెళ్లిన లారీ
Published Tue, Oct 6 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM
Advertisement