thurkapalli
-
సీఎం కేసీఆర్ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ!
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2020 అక్టోబర్ 31న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగుప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం విదితమే. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం విదితమే. కేసీఆర్ తొలుత గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. ఇక మటన్, చికెన్, పప్పు, పచ్చిపులుసుతో సహా 23 రకాల వంటకాలు.. వాసాలమర్రి సహపంక్తి భోజనాల కోసం సిద్ధమవుతున్నాయి. మటన్, చికెన్, చేపలు, బోటీ, తలకాయ కూర, గుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్‌పన్నీర్, బిర్యానీ రైస్, పులిహోర, పప్పు, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడాలు, పచ్చిపులుసు, చట్నీలు, చల్లచారు తదితర వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వంటలు వండిస్తున్నారు. చదవండి: CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి -
శ్రావణితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
తుర్కపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్ శ్రావణితో మంత్రి కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. గ్రామ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ అందరినీ మోటివేట్ చేస్తావా అని ప్రశ్నించారు. కేటీఆర్, శ్రావణి ఫోన్ సంభాషణ వారి మాటల్లోనే.. కేటీఆర్: హలో.. శ్రావణియేనా మాట్లాడేది? శ్రావణి: అవును సార్ శ్రావణిని మాట్లాడుతున్న.. నమస్కారం సార్ కేటీఆర్: నమస్కారమమ్మా.. నేడు చెప్పింది అంతా విన్నావా.. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? శ్రావణి: అనుమానాలు అట్లాంటివి ఏమీ లేవు సార్. మీరు చేసే అభివృద్ధి పనులు చూసి, నా వంతుగా నేను ఎందుకు చేయవద్దు అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ ఇన్చార్జిగా తీసుకొని ముందుకు వచ్చాను సార్. కేటీఆర్: థాంక్యూ బేటా.. థాంక్యూ వెరీమచ్. ఇదే స్ఫూర్తిని పది మందిలో నింపు. మీది రుస్తాపూర్ కదా.. శ్రావణి: అవును సార్. కేటీఆర్: రుస్తాపూర్‌లో ఎంత మంది ఓటర్లు ఉంటారు. శ్రావణి: 40, 50 మంది ఓటర్లు ఉంటారు సార్. కేటీఆర్: అందర్నీ మోటివేట్ చేస్తావా? శ్రావణి: అందర్నీ మోటివేట్ చేస్తా.. షూర్‌గా.. కేటీఆర్: తప్పకుండా.. శ్రావణి: తప్పకుండా చేస్తాను సార్ -
ఫైనాన్సర్ టోకరా!
సాక్షి, తుర్కపల్లి(ఆలేరు): అతనో వికలాంగుడు.. ఏప్రాంతంవాడో తెలియదు.. చిరువ్యాపారులకు డబ్బులు అప్పుగా ఇస్తూ ఫైనాన్సర్‌గా మారాడు. అయ్యప్పమాల వేసి పరమభక్తుడిగా నటించాడు.. పండుగలొస్తేచాలు హంగూఆర్భాటాలతో పూజలు చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. అన్నదానాలూ చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ ధనవంతుడినని నమ్మించాడు. తాను కొనుగోలు చేసిన భూములను తక్కువ ధరకు అమ్ముతానని కొందరిని నమ్మించి అడ్వాన్స్‌ల పేరిట రూ.51లక్షల వరకు వసూలు చేసి ఆ సొమ్ముతో రాత్రికిరాత్రే బిఛానా ఎత్తేశాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఆనంద్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న ఓ వికలాంగుడు నాలుగేళ్లక్రితం ఓ చిన్నపాటి సూట్‌కేసుతో తుర్కపల్లికి వచ్చాడు. తాను ఫైనాన్సర్అని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంట్లోకి కావాల్సిన ఏసీలు, ఫ్రిజ్, టీవీ, సోఫాలు, ఇలా రకరకాల వస్తువులు కొనుగోలు చేశాడు. తను ఉండే ఇంట్లో పరమభక్తుడిలా రోజూ పూజలు చేస్తూ చుట్టపక్కల వారికి ప్రసాదాలు పంచేవాడు. దీపావళి పండుగ వస్తే ఘనంగా లక్ష్మీపూజ చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. తుర్కపల్లిలో చిరువ్యాపారులకు, ఆటోడ్రైవర్లకు ఫైనాన్స్ ఇచ్చి డెయిలీ వసూళ్లకు యువకులను సైతం తన దగ్గర ఉద్యోగులుగా పెట్టుకున్నాడు. తాంత్రికస్వామిగా.. కార్తీకమాసం కంటే ముందే అయ్యప్పమాలధారణ చేసేవాడు. 23 సార్లు తాను మాలవేసుకున్న తాంత్రికస్వామిగా పరిచయం చేసుకున్నాడు. అయ్యప్ప పూజల సందర్భంగా పెద్ద ఎత్తున్న మండల కేంద్రంలో అన్నదానాలు చేసేవాడు. గుళ్లు గోపురాలకు పెద్ద ఎత్తున చందాలు రాసేవాడు. గణేశ్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆర్థికంగా ఉన్న అయ్యప్ప భక్తులు, ప్రజలపై కన్ను మాల వేసుకున్న భక్తుల్లో ఆర్థికంగా ఉన్నవారిపై ఓ కన్నువేసేవాడు.ఆ క్రమంలోనే చుట్టు పక్కల ఉన్న భూములను కొనుగోలు చేసానని భూమి జిరాక్స్ పత్రాలను వారికి చూపించేవాడు. ఎవరూ లేని సమయంలో ఆ భూముల వద్దకు తీసుకెళ్లి ఈ భూమి నేను అగ్రిమెంట్ చేసుకున్నానని నమ్మించే వాడు. ఆ భూములను తక్కువ ధరలకు మీకు అమ్ముతామని పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అందరికీ తెలిస్తే భూమిని మీకు అమ్మనని స్పష్టంచేసేవాడు. అనంతపురం వాసుడిగా.. మీరు ఏప్రాంతం నుంచి వచ్చారని ప్రజలు అడిగితే తనది అనంతçపురం అని, ధనవంతుల కుటుంబం అని నమ్మించాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ అని అడిగితే తన ఫొటోతో ఇతరుల ఫొటోలను జతచేసి మార్ఫింగ్చేసి కుటుంబ సభ్యులని చూపించాడు. గురుస్వామిని నమ్మించి.. తుర్కపల్లికి చెందిన ఓగురుస్వామిని నమ్మించి రూ.36లక్షలు వసూలు చేశాడు. తాను బొమ్మలరామారంలోని మెయిన్‌రోడ్డులో భూమి కొనుగోలు చేశానని ఆ గురుస్వామిని అక్కడికి తీసుకెళ్లి చూయించాడు. ఇక్కడ 14 ఎకరాలు ఉందని దీనిని యజమానులు రూ.75వేలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారని తెలిపాడు. ఇందులో 5 ఎకరాల భూమని తాను వారి వద్దనుంచి రూ.5లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశానని చెప్పాడు. ఈ భూమికి ఎకరం రూ.80లక్షల వరకు డిమాండ్ ఉందని కానీ గురుస్వామి కాబట్టి మీకు రూ.20లక్షలకు ఎకరం చొప్పున విక్రయిస్తానని చెప్పి నమ్మించాడు. ఇలా ఆ గురుస్వామినుంచి ఇటీవల రూ. 36 లక్షలు వసూలు చేశాడు. మరో వ్యక్తి వద్దనుంచి రూ.5లక్షలు, ఓహోటల్ యజమాని వద్ద రూ.2.50లక్షలు, మరికొంతరి వద్ద కొంత సొమ్ము వసూలు చేశాడు. ఈ నెల 27న భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని రావాలని గురుస్వామికి చెప్పాడు. అయితే 27తేదీన ఫైనాన్సర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో గురుస్వామి ఆఫైనాన్సర్ ఇంటి వెళ్లివాకబు చేశాడు. పనిమీద రాత్రి బయటికి వెళ్లాడని, రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పాడని అతని వద్ద పనిచేసే వర్కర్లు చెప్పారు. మంగళవారం ఫోన్ చేసినా స్విచ్ఆఫ్ వచ్చింది. అతడు 51 లక్షల రూపాయల నగదు ,నగలతో ఆదివారం రాత్రి తన మూడుచక్రాల వాహనంపైన భువనగిరికి వెళ్లి బస్‌స్టాండ్‌లోని పార్కింగ్‌లో ఉంచి ఆటోలో పరారయ్యాడు. గురుస్వామితో పాటు మరో ఐదుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. ఎటువంటి ఆధారం దొరకకుండా.. ఎవరికీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆనంద్‌రెడ్డి వ్యవహరించాడు. అతడు వాడిన ఫోన్లు, సి మ్‌లతో పాటు వాహనం కూడా గ్రామస్తుల పే రుమీదనే కొనుగోలు చేశాడు. తన ఉంటున్న గది లో పలుబ్యాంక్లకు సంబంధించిన పాస్పుస్తాకా లు, ఖాళీ చెక్కులు, ఆధార్‌కార్డులు, ప్రామిసరీ నోట్లు, వాహనాలు ధ్రువీకరణ పత్రాలు లభించాయి. పలు జిల్లాల్లో కూడా కేసులు ఆంధ్రరాష్ట్రంలోని అనంతపుం, తాడిపత్రి, చిత్తూ రు, మదనపల్లి, తిరుపతిలో అతని పై పలు కేసులున్నాయని పోలీసులు తెలియజేశారు. -
తుర్కపల్లి : అక్రమవెంచర్లకు అడ్డేదీ ?
సాక్షి, తుర్కపల్లి : రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగి పోవడంతో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేసుకొని వాటిలో ప్లాట్లు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు.అధికార యంత్రాంగానికి ఈ తంతు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది.హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుర్కపల్లి మండలంలో అక్రమ వెంచర్ల హవా కొనసాగుతున్నా అధికారులకు పట్టకపోవడం శోచనీయం. తక్కువ ధరలకు భూముల కొనుగోలు.. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకొని, ఆ భూమిలోనే 200 గజాలు, 100 గజాలు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా రు. మండల కేంద్రం హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉం డటం, యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃనిర్మాణం కావడంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వ్యవసాయభూములు ఎకరానికి కోటి నుంచి కోటి 50 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల దగ్గర నుంచి ఎకరాల చొప్పున కొనుగోలు చేసుకొని ఎ టువంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అనుమతులు కరువు .. తుర్కపల్లి, మాదాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్, పల్లెపహాడ్, ముల్కలపల్లి, రుస్తాపూర్ గ్రామాల్లో ఈ రియల్ ఎస్టేట్ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను విక్రయించి వాటిని ప్లాట్లుగా మార్చేటప్పుడు డీటీసీపీ అనుమతులు పొందాలి. కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్‌శాఖ, అటవీశాఖ, గ్రామపంచాయతీ అనుమతులు, నీటి పారుదల శాఖ ముందస్తు అనుమతులు పొందాలి. అధికారులు వెంచర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. అక్రమ వెంచర్లపై చర్య తీసుకుంటాం.. మండలంలో నిర్వహిస్తున్న అక్రమ వెంచర్లపైన చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వచ్చిన వాటికి హద్దురాళ్లు తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన చర్యలు తీసుకున్నాం. గ్రామ కార్యదర్శులకు ఈ విషయంలో అవగాహన కలిగించి సత్వర చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, ఈఓపీఆర్డీ -
ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
సాక్షి,తుర్కపల్లి : ప్రజలు ఆశీర్వదిస్తే ఆలేరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ ఆభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలంలోని రుస్తాపూర్, రాంపూర్, మోతీరాంతండా, పల్లెపహాడ్, తుర్కపల్లి, మల్కాపూర్, చిన్నలక్ష్మపూర్, మాధాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని, రైతులకు సాగునీరు అందించి వారి ఆదాయం నాలుగు రెట్లు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని, అన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసే విధంగా మేకిన్ ఆలేరుగా తీర్చిదిద్దుతానని, ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాట పెంటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు శత్రునా యక్, మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ, ఆకుల రమేశ్, నరేందర్‌నాయక్, కొక్కొండ రాజుగౌడ్, బోళ్ల నర్సింహులు, ఆకుల సైదులుతు, సందీప్‌చారి, గుండెబోయిన మల్లేశం పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
గొర్రెలమందపైకి దూసుకెళ్లిన లారీ
తుర్కపల్లి లారీ అదుపుతప్పి గొర్రెల మందపై దూసుకెళ్లింది. ప్రమాదంలో 40 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 గొర్రెలు, ఇద్దరు కాపరులకు గాయాలయ్యాయి. ఈ ఘటన తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రనికి చెందిన లారీ ఆలుగడ్డ లోడ్‌తో మహా రాష్ట్ర నుంచి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మీదుగా భువనగిరి వైపునకు వెలుతోంది. రుస్తాపూర్ గ్రామం శివారు ప్రాంతం నుంచి గొర్రెల మందతో వస్తున్న పెద్దతండాకు చెందిన ధీరావత్బీమ్లా తన చిన్నమ్మ ధీరావత్ కేళీతో కలిసి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమం లో గ్రామ శివారులోకి రాగానే వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి గొర్రెలమందపైకి దూసుకొచ్చింది. 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరులు బీమ్లా, కేళీలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భువనగిరి నుంచి జగదేవ్‌పూర్ వరకు రోడ్డు రక్తసిక్తమైంది. ప్రమాదం జరగగానే డ్రైవర్ పరారుకావడంతో క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పమాదానికి నిద్రమత్తే కారణం ప్రమాదానికి నిద్రమత్తే కారణమని స్థానికులు పేర్కొన్నారు. లారీలో మ ద్యం సీసాలతో పాటుగా మాంసహారం కూడా ఉంది. క్లీనర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలపలేక పోతున్నాడని తెలి పారు. ఎస్ఐ మధుసూధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.