
సాక్షి, గోపాల్‌పేట (వనపర్తి) : రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన ఓ మేకను పంచాయతీ కార్యదర్శి చెట్టుకు కట్టేశాడు. మండలంలోని ఏదుట్లలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రోడ్డు వెంబడి నాటిన మొక్కలను మంగళవారం ఓ మేక తినేసింది. దీంతో ఇంత కష్టపడి మొక్కలు నాటుతుంటే మేకలు తింటున్నాయని మేకల యజమానిని హెచ్చరించేందుకు మేకను కట్టివేశానని కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మేక మెడలో తెలియక మేశాను.. దయచేసి నన్ను విడిపించండి అని అట్టపై రాసి మేక మెడకు తగిలించాడు.
Comments
Please login to add a commentAdd a comment