
దొంగలను పట్టించిన మేక...!
మెదక్(హత్నూర): మేకను దొంగలించేందుకు ప్రయత్నించిన దొంగలు అడ్డంగా దొరికిపోయారు . రెండుషాపుల్లో చోరీ చేయడంతో పాటు మేకను దొంగలించేందుకు యత్నించిన సంఘటన మండల కేంద్రమైన హత్నూరలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామంలోని పోలీస్టేషన్ సమీపంలో ఉన్న శ్రీరామ ఫొటోస్టూడియో, పక్కనే ఉన్న కిరాణషాపులో వెనుకభాగంలో ఉన్న కిటికీల రాడ్లను వంచి ఫొటో స్టూడియోలోని కంప్యూటర్లను ధ్వంసం చేయడంతోపాటు 13వేల రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాదితుడు రామస్వామి తెలిపారు.
కిరాణషాపులో నుంచి సామాన్లు పోయినట్లు బాదితుడు మధు తెలిపారు. రెండుషాపుల వెనుకభాగంలో ఉన్న ఓ ఇంటి ముందు మేకను దొంగలు తీసుకెళ్ళె ప్రయత్నంలో దొరికిపోయారు. కొందరు పారిపోయారు. ఫొటోస్టూడియో చోరీకి పాల్పడిన ఓ దొంగ దొరకడంతో అదే రాత్రి పోలీసులకు అప్పగించారు. గురువారం ఉదయం బాదితులు పోలీస్టేషన్‌లో పిర్యాదు చేశారు.