విజయ్ రాజకీయాలకు ది గెటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) చిత్రానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గోట్. నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, అజ్మల్, అమీర్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాత్తి ఎస్ అఘోరం, కల్పాత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్. సురేష్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ కథాచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సిద్ధార్థ నూని ఛాయాగ్రహణం అందించారు.
నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6000కు పైగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత అర్చన మాట్లాడుతూ ఇది ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన 25వ చిత్రం అని తెలిపారు. అదేవిధంగా విజయ్ హీరోగా ఇంతకు ముందు బిగిల్ చిత్రాన్ని చేసామని, తాజాగా గోట్ ఆయనతో చేసిన రెండవ చిత్రమని చెప్పారు. లేకపోతే వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం.
ఇది సాంకేతిక పరంగా చాలా బలమైన చిత్రమని పేర్కొన్నారు. గోట్ చిత్రం ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ నిచ్చిందని చెప్పారు. దర్శకుడు వెంకట ప్రభు మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను ఇస్తాన్బుల్ లో నిర్వహించాలని వెళ్లామని అయితే అక్కడ షూటింగ్ సాధ్యం కాకపోవడంతో రష్యాలో కొంత భాగం చిత్రీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా గోట్ చిత్ర షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోనే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు.
చిత్రంలోని వీఎఫ్ ఎక్స్ సన్నివేశాల కోసం ప్రపంచంలోనే పేరుగాంచిన లోలా సంస్థతో ఒప్పందం చేసుకుని రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాలను అందించే కమర్షియల్ అంశాలతో కూడిన పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. నటుడు విజయ్ రాజకీయాలకు గోట్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment