భూమిమీద జీవించి ఉన్న బల్లిజాతుల్లో అతిపెద్దవి కొమొడొ డ్రాగన్లన్న సంగతి తెలిసిందే. మిగతా మాంసాహార జీవులతో పోల్చుకుంటే కొమొడోలు వేటాడే విధానం భయానకంగా, మరింత తెలివితేటలతో కూడి ఉంటుంది.
ఇండోనేసియాలోని ప్రఖ్యాత కొమొడొ ఐలాండ్ లో రెండు భయంకరమైన కొమొడో డ్రాగన్లు ఓ మేకను వేటాడిన దృశ్యాలు చూస్తే అది నిజమని ఇట్టే అర్థం అవుతుంది. రష్యాకు చెందిన జూలియా సుడుకోవా అనే ఫొటోగ్రాఫర్ సాహసోపేతంగా తీసిన ఈ ఫొటోలు సోషల్ నెట్ వర్క్ లో పలువురి మన్ననలు పొందాయి.