బడికొచ్చిన మేక | goat attend school with student | Sakshi
Sakshi News home page

బడికొచ్చిన మేక

Published Wed, Nov 8 2017 12:08 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

goat attend school with student - Sakshi

గద్వాల: ఈ ఫొటోలో మేకకు ఆకులు వేస్తున్న విద్యార్థి పేరు మహేష్‌. జోగుళాంబ గద్వాల జిల్లా జంగంపల్లికి చెందిన నారాయణ అనే దినసరి కూలి కుమారుడు. అతనికి మహేష్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు, ఓ మేకకూడా ఉంది. కొన్నిరోజులుగా తల్లిదండ్రులు కూతుళ్లకు బడికి పంపి కుమారుడిని మాత్రం మేకను చూసుకోవాలంటూ ఇంటి వద్దే ఉంచుతున్నారు. అయితే మహేష్‌ బడికి ఎందుకు రావడంలేదో తెలుసుకోవడానికి హెచ్‌ఎం కాంతయ్య, ఉపాధ్యాయుడు రత్నాకర్‌రెడ్డి మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లి రమ్మని పిలిచారు.

‘ఇంటి దగ్గర మేకను వేపడానికి ఎవ్వరు లేరు సార్‌.. మేకను వదలిపెట్టి ఎలా రావాలి’ అంటూ ప్రశ్నించాడు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థితో పాటు మేకను కూడా పాఠశాలకు తీసుకొచ్చి ఆవరణలో ఉన్న చెట్టుకు కట్టేశారు. పాఠాలు విన్న మహేష్‌ మధ్యాహ్న భోజనం తిని తన మేకకు కూడా ఇదిగో ఇలా ఆకులు వేస్తూ కనిపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement