
కలెక్టర్ ఇంట్లో మేక హంగామా.. అరెస్ట్
రాయ్ పూర్: జిల్లా కలెక్టర్ ఇంటి గార్డెడ్ లో ప్రవేశించి నానా బీభత్సం చేసిన ఓ మేకను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు ఆ మేకను కోర్టులో హాజరు చేయనున్నట్లు సమాచారం. ఈ మేకతో పాటుగా దాని యజమానిని కోర్టులో హాజరు పరచాల్సి ఉందని.. రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నయని ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ తెలిపారు.
వివరాలిలా ఉన్నాయి.. రాజధాని రాయ్ పూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో కొరియా అనే ప్రాంతం ఉంది. అబ్దుల్ హసన్ అనే వ్యక్తికి చెందిన మేకపై జిల్లా కలెక్టర్ హేమంత్ రాత్రే తోటమాలి ఫిర్యాదు చేశాడు. మళ్లీ మళ్లీ ఆ మేక తమ తోటలోకి వస్తుందని తోటమాలి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ వివరించారు. యజమాని మేకను నియంత్రించలేకపోవడంతో ఇలా జరుగుతుందని తోటమాలి చెప్పాడు.
మేకతో పాటుగా నన్ను కూడా...
తన మేక మేజిస్ట్రేట్ ఇంటి గోడ దూకి, ఆ ఇంటి గార్డెన్ లోని పూలను, కూరగాయలను చెల్లాచెదురు చేసింది. దీంతో మేకతో సహా తనను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని మేక యజమాని అబ్దుల్ హసన్ వివరించాడు.