సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న మేకపోతు బరువు 110 కిలోలు, వయసు 3 ఏళ్లు. నల్లమచ్చ లేని ఈ జమునాపారి మేకపోతు రాజస్తాన్‌కు చెందినది. శంకర్ కిచర్ అనే రైతు పెంచుతున్న దీని విలువ అక్షరాలా రూ. 6 లక్షలు! ఉత్తరప్రదేశ్‌లోని మథుర సమీపంలో ఉన్న నేషనల్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ (ఎన్‌ఎస్‌ఐఎఫ్‌ఆర్‌జీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్’లో బరువు విభాగంలో ఈ మేకపోతు ప్రథమ బహుమతి పొందింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి గొర్రె, మేకపోతులు ఈ ప్రదర్శనకు భారీగా తరలివచ్చాయి.
ఈ సందర్భంగా ‘ఇండస్ట్రీ సైంటిస్ట్ ఫార్మర్స్ ఇంటర్‌ఫేస్’ పేరిట నిర్వహించిన ఒకరోజు సదస్సుకు రాష్ట్రం నుంచి పలువురు గోట్‌ఫామ్స్ యజమానులు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో జీవాల సంపద పెరిగినందున వాటిపై పరిశోధనల కోసం జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment