
ముక్కు స్థానంలో కళ్లు!
జన్యులోపం కారణంగా ఓ మేక ముక్కు లేకుండా దాని స్థానంలో రెండు కళ్లతో జన్మించింది. ఈ సంఘటన మండలంలోని కప్పపహాడ్ గ్రామంలో మంగళవారం ఉదయం జన్మించింది. గ్రామానికి చెందిన దొడ్డి యాదయ్య మందలో ఉన్న ఓ మేక మొదటి ఈతలో ఒక మేక పిల్లకు జన్మనిచ్చింది. ఈ మేకకు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఒకే దగ్గర ఉన్నాయి. నోరు చిన్నగా ఎడమవైపు ఉంది. ఆ మేక పిల్ల ఆరోగ్యంగానే ఉంది.
- ఇబ్రహీంపట్నం రూరల్