పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. సీనియర్ ఆటగాడనే ట్యాగ్‌తో ఈ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న మాలిక్ దారుణ ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. మూడు మ్యాచ్‌లే ఆడిన అతను 8, 0, 0 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో మెగాటోర్నీలో పాక్ కథ ముగిసిన విషయం తెలిసిందే.