
‘ఎ’ గ్రేడ్‌లో మాలిక్
కరాచీ : చాలా ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కాంట్రాక్ట్ ల భించని షోయబ్ మాలి క్ ఇటీవలి మెరుగైన ప్ర దర్శనతో ఒక్కసారిగా బోర్డు దృష్టిలో పడ్డాడు. ఫలితంగా అతనికి నేరు గా ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది. రెండేళ్ల తర్వాత టీమ్‌లోకి వచ్చిన మాలిక్ జింబాబ్వే, శ్రీలంకతో సిరీస్‌లలో నిలకడగా రాణించాడు. వచ్చే ఏడాది కాలానికి 27 మంది ఆటగాళ్లను నాలుగు రకాల గ్రేడ్‌లలో వవిభజిస్తూ పీసీబీ కొత్త కాంట్రాక్ట్‌లు ప్రకటించింది.
‘ఎ’ గ్రేడ్‌లో మూడు ఫార్మాట్‌ల కెప్టెన్లు మిస్బా, అజహర్ అలీ, ఆఫ్రిదిలతో పాటు హఫీజ్, యూనిస్ ఖాన్‌లకు స్థానం దక్కింది. బౌలింగ్ యాక్షన్ మార్పు తర్వాత వరుసగా విఫలమవుతున్న అజ్మల్ ‘ఎ’నుంచి ‘బి’ గ్రేడ్‌కు పడిపోగా, ఉమర్ గుల్‌ను పూర్తిగా తప్పించారు.