చాంపియన్ ట్రోఫీ-2017 ఫైనల్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో టీమిండియా- పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వులు చిందించుకున్న విషయం తెలిసిందే. అయితే ఘోర ఓటమి అనంతరం ఏ మాత్రం బాధ లేకుండా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకోవడం పట్ల అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఆ నవ్వుల వెనకాల గల కారణాలను పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయాబ్ మాలిక్ వివరించాడు. తాజాగా స్థానిక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ ఆనాటి విషయాలను నెమరువేసుకున్నాడు.