PC: ICC
Zaheer Khan Comments on Shoaib Malik: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌పై టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి.. సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా షార్జా వేదికగా మంగళవారం కివీస్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు... కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11) సహా హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరడంతో.. పాక్ ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ 20 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్ల సాయంతో 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడికి తోడైన ఆసిఫ్ అలీ వరుస షాట్లు కొట్టడంతో మరో 8 బంతులుండగానే పాకిస్తాన్ లక్ష్యం పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ క్రిక్‌బజ్ లైవ్‌లో మాట్లాడుతూ షోయబ్ మాలిక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘షోయబ్ మాలిక్ లాంటి సీనియర్ ఆటగాళ్లను ఎందుకు జట్టులోకి తీసుకుంటారని అభిమానులు తరచుగా అడుగుతుంటారు కదా. ఇదిగో ఇందుకే వారిని ఆడిస్తారు. ఒత్తిడిని ఎలా జయించాలో వారికి తెలుసు. వాళ్లకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలరు. అన్నింటి కంటే ఈ లక్షణాలే ముఖ్యం.
చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన షోయబ్ మాలిక్.. ఈరోజు సెలక్టర్ల నిర్ణయం తప్పుకాదని నిరూపించాడు’’ అని కితాబిచ్చాడు. కాగా సోహైబ్ మక్సూద్‌ను గాయం కావడంతో చివరి నిమిషంలో షోయబ్ పాక్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో పాకిస్తాన్‌కు వరుస విజయాలు అందిస్తున్న కెప్టెన్ బాబర్ ఆజంను కూడా జహీర్ ఖాన్ ప్రశంసించాడు. ‘‘ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు అంటే ఇదీ అని ఒక అంచనా వేయలేకపోయేవాళ్లం. కానీ... బాబర్ ఆజం చాలా కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు కొత్త దారి చూపిస్తున్నాడు’’ అని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ సూపర్-12లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్‌పై వరుస విజయాలతో పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరువవుతోంది.
చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్!
Comments
Please login to add a commentAdd a comment