ఇస్లామాబాద్: చాంపియన్ ట్రోఫీ-2017 ఫైనల్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో టీమిండియా- పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వులు చిందించుకున్న విషయం తెలిసిందే. అయితే ఘోర ఓటమి అనంతరం ఏ మాత్రం బాధ లేకుండా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకోవడం పట్ల అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఆ నవ్వుల వెనకాల గల కారణాలను పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయాబ్ మాలిక్ వివరించాడు. తాజాగా స్థానిక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ ఆనాటి విషయాలను నెమరువేసుకున్నాడు. ఓ మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ను స్పిన్నర్ సయీద్ ఆజ్మల్, మాలిక్‌లు ఫన్నీగా డ్రాప్ చేశారు. చాంపియన్ ట్రోఫిలో విండీస్‌తో మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అందుకునేందుకు అజ్మల్, మాలిక్‌లు ప్రయత్నించారు. అయితే మాలిక్ అందుకుంటాడని ఆజ్మల్, ఆజ్మల్ అందుకుంటాడని మాలిక్‌లు చివరి క్షణంలో క్యాచ్‌ను వదిలేశారు.
అయితే క్యాచ్ డ్రాప్ అనంతరం ఆజ్మల్‌తో మాలిక్.. ‘నువ్వు నీ స్థానంలో ఉంటే క్యాచ్‌ను సులభంగా అందుకునే వాడివి కదా.. ఎందుకు పొజీషన్ ఛేంజ్ అయ్యావు?. అప్పుడు ఆజ్మల్ సమాధానమిస్తూ నువ్వు క్యాచ్ మిస్ చేస్తే బంతి నేలపై పడకుండా త్వరగా అందుకుందామని అనుకున్నాను’ అంటూ ఆజ్మల్ ఫన్నీగా సమాధానమిచ్చాడని మాలిక్ వివరించాడు. ఇదే విషయాన్ని టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలకు చెబితే తెగ నవ్వారని ఆనాటి సంఘటనను వివరించాడు. అయితే పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్ ట్రోఫీ పైనల్‌లో టీమిండియా 180 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment