షోయబ్-సానియాల ట్వీట్లు వైరల్ | Sania Mirza and Shoaib Malik's romantic banter | Sakshi
Sakshi News home page

షోయబ్-సానియాల ట్వీట్లు వైరల్

Published Mon, Oct 30 2017 12:24 PM | Last Updated on Mon, Oct 30 2017 12:24 PM

Sania Mirza and Shoaib Malik's romantic banter

లాహోర్:శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లోను పాకిస్తాన్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరి టి20 పోరులో పాక్‌ 36 పరుగుల తేడాతో లంకపై గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.. మొదట పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. షోయబ్‌ మాలిక్‌ (51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉమర్‌ అమిన్‌ (45; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడి పాక్ విజయంలో సహకరించారు. అయితే దీనిలో భాగంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను షోయబ్ మాలిక్ గెలుచుకున్నాడు. అయితే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న మాలిక్ కు బైక్ ను బహుమతిగా ఇచ్చారు.

ఈ మేరకు తన భర్త షోయబ్ మాలిక్ బైక్ పై ఉన్న ఫొటోను భార్య సానియా మీర్జా ట్వీట్ చేసింది. దానికి మనం బైక్ పై రైడ్ కి వెళదామా?అంటూ  హిందీలో ఒక క్యాప్షన్ ఇచ్చింది. దీనికి స్పందించిన మాలిక్..  'స్వీట్ హార్ట్ తొందరగా సిద్ధం అవ్వు' అంటూ రిప్లే ఇచ్చాడు. అప్పుడు మాలిక్ మరో ఫోటో ట్వీట్ చేశాడు. తన గెలుచుకున్న బైక్ పై సహచర క్రికెటర్ షాదబ్ ఖాన్ ఎక్కించుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి సానియా బదులిస్తూ.. 'సీటు ఖాలీ లేదా? నో ప్రాబ్లం' అంటూ భర్త షోయబ్ ను ఆట పట్టించింది. ఇలా చాలాకాలం తర్వాత వీరిద్దర మధ్య ట్వీట్ల ద్వారా సాగిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement