ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కార్డిఫ్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (87), స్టోక్స్ (75) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాక్ 48.2 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది.
సర్ఫరాజ్ అహ్మద్ (90), షోయబ్ మాలిక్ (77) నాలుగో వికెట్‌కు 163 పరుగులు జోడించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి నాలుగు వన్డేలు గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకోగా, తాజా ఫలితంలో ఈ ఆధిక్యం 4-1కి తగ్గింది. ఇరు జట్లు బుధవారం మాంచెస్టర్‌లో జరిగే ఏకైక టి20లో తలపడతారుు.