
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూపర్-4 స్టేజ్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఫీల్డింగ్ చేస్తుండగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత క్రికెట్ అభిమానులు ‘షోయబ్ జీజూ(బావ).. ఒకసారి ఇటు చూడవా’ అంటూ కేకలు వేశారు. షోయబ్ ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వారి కేకలు విని షోయబ్ వెనక్కి తిరిగి వారికి హాయ్ చెప్పారు. అభిమానులు ‘బావ’ అంటూ కేకలు వేస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులు ట్విటర్‌లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment