T20 WC 2021 IND Vs PAK.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీమిండియాతో ఆడే జట్టును పాకిస్తాన్ ప్రకటించేసింది. ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ కూడా ఉన్నారు. కాగా ఈ ఇద్దరికి జట్టులో చోటు కల్పించడంపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అజమ్.. మహ్మద్ రిజ్వాన్‌లు ఓపెనర్లుగా వస్తారు.. ఇక వన్‌డౌన్‌లో ఫఖర్ జమాన్ ఉంటాడు. నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్ హఫీజ్ , హైదర అలీ వస్తే బాగుంటుంది. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు ఒకేసారి ఆడకూడదు.
చదవండి: T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
వయసు రిత్యా మాలిక్‌కు 39, హఫీజ్‌కు 41.. ఇద్దరికి కలిపి 80 ఏళ్లు ఉంటాయి. వాళ్లిద్దరు కలిసి ఆడితే నాకు 80 ఏళ్ల ముసలోడు కనిపిస్తాడు. అందుకే షోయబ్ మాలిక్ స్థానంలో హైదర్ అలీని ఆడించాలి. హఫీజ్ ప్రస్తుతం పాక్ మిడిలార్డర్‌లో బలమైన బ్యాటర్‌గా ఉన్నాడు. అతనికి జతగా హైదర్ అలీ అయితేనే కరెక్ట్‌గా ఉంటుంది. అప్పుడే టీమ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. ఇక ఆరు, ఏడు స్థానాల్లో ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్‌లు.. 8,9,10 స్థానాల్లో షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్.. చివరగా షాహిన్ అఫ్రిది ఉంటారు. అని చెప్పుకొచ్చాడు. ఇక మహ్మద్ హఫీజ్ కొన్నేళ్లుగా పాకిస్తాన్ జట్టులో మిడిలార్డర్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 116 టి20ల్లో 2429 పరుగులు చేశాడు. ఇక మాలిక్ గత రెండేళ్లుగా పాకిస్తాన్ తరపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఓవరాల్‌గా పాక్ తరపున 116 టి20లు ఆడిన మాలిక్ 2335 పరుగులు సాధించాడు.
చదవండి: Babar Azam: మా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.. ఇమ్రాన్‌తో మాట్లాడాము
Comments
Please login to add a commentAdd a comment