షోయబ్ మాలిక్ (PC: Shoaib Malik Twitter)
T20 World Cup 2022: ‘‘నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే నా పని. జట్టుకు ఎంపిక చేయాలా వద్దా అన్న విషయం యాజమాన్యం నిర్ణయిస్తుంది’’ అని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు. టీ20 వరల్డ్‌కప్-2022కు ఎంపిక కాకపోవడంపై ఈ మేరకు స్పందిస్తూ.. తనకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని, ఈ విషయంలో ఎవరిని నిందించాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు.
కాగా పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ తొలి ఎడిషన్(2007)లో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించిన షోయబ్ మాలిక్.. 2009లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. అదే విధంగా పలు కీలక మ్యాచ్‌లలో జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. అయితే, ఆసియాకప్-2022తో పాటు.. అక్టోబరు 16న ఆస్ట్రేలియా వేదికగా మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2022 ఈవెంట్‌కు ఎంపిక చేసిన జట్టులో మాత్రం అతడికి చోటుదక్కలేదు.
తను ఇప్పుడు కెప్టెన్ కదా!
ఈ నేపథ్యంలో సామా టీవీతో మాట్లాడిన షోయబ్ మాలిక్.. తను కెరీర్‌లో విజయవంతం కావడానికి తన సానకూల దృక్పథమే కారణమని.. ఇప్పుడు కూడా అలాగే ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. ఇక కెప్టెన్ బాబర్ ఆజంతో తనకున్న అనుబంధం గురించి ఈ సందర్భంగా షోయబ్ మాలిక్ ప్రస్తావించాడు. ‘‘మేమిద్దరం కాంటాక్ట్‌లోనే ఉంటాం. ఇంతకుముందైతే మేము ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం.
కానీ ఇప్పుడు తను కెప్టెన్ కదా! తన స్పేస్ తనకు ఇవ్వాల్సి ఉంటుంది. బాబర్‌తో ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని జట్టు సెలక్షన్ సమయంలో నన్ను పరిగణనలోకి తీసుకోవాలని నేనెప్పుడూ ఒత్తిడి చేయలేదు. అసలు అలాంటి ప్రయత్నమే ఎప్పుడూ చేయలేదు’’ అని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు.
కాగా ఇటీవల నేషనల్ టీ20 కప్ 2022 టోర్నీలో ఆడిన 40 ఏళ్ల షోయబ్ మాలిక్.. 9 ఇన్నింగ్స్‌లో 204 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది ప్రపంచకప్ తర్వాత అతడు ఏ టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. ఇదిలా ఉంటే ప్రపంచకప్-2022లో టీమిండియాతో అక్టోబరు 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: Asia Cup 2023: మెగా టోర్నీ ఆడేందుకు పాక్‌కు టీమిండియా? సుదీర్ఘ విరామం తర్వాత..!
T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్‌లో అతడే టీమిండియా టాప్ రన్ స్కోరర్'
Ind Vs Pak- Babar Azam: భారత్‌తో మ్యాచ్ కోసమే ఇదంతా: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment