
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొదటి సారి తన కొడుకు ఫోటోను అభిమానులతో పంచుకుంది. సానియా, షోయబ్ మాలిక్ దంపతులకు అక్టోబర్ 30న బాబు పుట్టాడు. తమ అబ్బాయి ఇజ్‌హాన్ ఫోటోను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ సానియా, షోయబ్ ఒకే వ్యాఖ్యతో ఆనందాన్ని వ్యక్తీకరించారు. ‘జీవితం చాలా వేగంగా, సరదాగా గడిచిపోతోంది. ప్రపంచానికి హలో చెప్పే సమయం వచ్చేసింది. అల్లాకు కృతజ్ఞతలు’ అని వారిద్దరు వ్యాఖ్య జోడించారు. ప్రస్తుతం మళ్లీ టెన్నిస్‌లోకి అడుగు పెట్టే ప్రయత్నంలో ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడంపై సానియా దృష్టిపెట్టగా, షోయబ్ మాలిక్ పాకిస్తాన్ దేశవాళీ టి20 టోర్నీలో ఆడుతున్నాడు.