పవిత్ర యాత్రలో సానియా దంపతులు | Sania And Shoaib Visited Umrah | Sakshi
Sakshi News home page

పవిత్ర యాత్రలో సానియా దంపతులు

Published Wed, May 16 2018 9:50 AM | Last Updated on Wed, May 16 2018 10:39 AM

Sania And Shoaib Visited Umrah - Sakshi

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, తన భర్త పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో పాటు తల్లిదండ్రులతో కలసి పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లారు. మొదట యూఏఈ చేరుకున్న సానియా దంపతులు అక్కడి నుంచి సౌదీ అరేబియాకు చేరుకున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని గత నెలలో సానియా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పుట్టబోయే బిడ్డకు అల్లా దీవెనల కోసం సానియా దంపతులు ఈ యాత్ర చేపట్టినట్టు తెసుస్తోంది.

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభానికి ముందే సానియా తన కుటుంబ సభ్యులతో కలసి ఉమ్రా యాత్రకు వెళ్లిన ఫొటోలను షోయబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. క్యూట్‌ కపుల్‌,  అల్లా దీవెనలు మీకు ఉంటాయి.. అంటూ ఈ ఫొటోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.  

Blessed 🙏🏼

A post shared by Shoaib Malik (@realshoaibmalik) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement