లంక ప్రీమియర్ లీగ్-2023లో దంబుల్లా ఆరా వరుసగా రెండో విజయం సాధిచింది. పల్లెకెలె వేదికగా జాఫ్నా కింగ్స్ తో జరిగిన స్కోరింగ్ థ్రిల్లర్‌లో 9 పరుగుల తేడాతో దంబుల్లా విజయం సాధించింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్ షోయాబ్ మాలిక్ ఆఖరి వరకు పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జాఫ్నా కింగ్స్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులొకి వచ్చిన మాలిక్.. అచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ.. మాలిక్ మాత్రం పట్టుదలో క్రీజులో నిలిచాడు. 14 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన మాలిక్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవరాల్‌గా 53 బంతులు ఎదుర్కొన్న మాలిక్.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
లక్ష్య ఛేదనలో జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. దంబుల్లా బ్యాటర్లలో కుశాల్ పెరీరా(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫ్నా కింగ్స్ బౌలర్లలో మాలిక్, తుషారా తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో మూడో టీ20.. కిషన్‌పై వేటు! యువ సంచలనం ఎంట్రీ! అతడికి ఆఖరి ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment