'టీమిండియాతో ఫైనల్ ఆడాలనుకుంటున్నాం' | Team keen on rematch with India, says Shoaib Malik | Sakshi
Sakshi News home page

'టీమిండియాతో ఫైనల్ ఆడాలనుకుంటున్నాం'

Published Mon, Feb 29 2016 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

'టీమిండియాతో ఫైనల్ ఆడాలనుకుంటున్నాం'

'టీమిండియాతో ఫైనల్ ఆడాలనుకుంటున్నాం'

కరాచీ:ఆసియాకప్లో మరోసారి టీమిండియాతో పోరును కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ స్పష్టం చేశాడు. పిచ్ పరిస్థితుల్ని అర్ధం చేసుకోవడంలో విఫలం చెందడం వల్లే భారత్ తో ఓటమి చవిచూసినట్లు ఈ సందర్భంగా మాలిక్ పేర్కొన్నాడు. అయితే ఈ టోర్నీలో తాము ఫైనల్ చేరే అంశంపై ప్రధానంగా దృష్టి  సారించినట్లు తెలిపాడు. తాము తుదిపోరులో టీమిండియాతో తలపడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

 

'భారత్తో ఫైనల్ పోరును కోరుకుంటున్నాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే మా మధ్య మరోసారి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. భారత్ను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. కాకపోతే గ్రూప్ మ్యాచ్లో మా ఓటమికి పిచ్ పరిస్థితులే కారణం. ఆ ఓటమి  జట్టులోని ప్రతీ ఒక్కర్నీ బాధించింది.  పాకిస్తాన్ ప్రధాన బలం పేస్ బౌలింగ్. బ్యాటింగ్లో గౌరవప్రదమైన స్కోరును చేస్తేనే బౌలర్ల పని సులభం అవుతుంది'అని మాలిక్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement