మహిళల ఆసియా కప్ టి20 టోర్నీ షెడ్యూల్ విడుదల
దుబాయ్: ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 19 నుంచి 28 వరకు దంబుల్లాలో ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
చివరిసారి 2022లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. క్రితంసారి ఏడు జట్లు పాల్గొనగా... ఈసారి ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి.
గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లున్నాయి. భారత్ తమ మూడు లీగ్ మ్యాచ్‌లను వరుసగా యూఏఈ (జూలై 19న), పాకిస్తాన్ (జూలై 21న), నేపాల్ (జూలై 23న) జట్లతో ఆడుతుంది. జూలై 26న సెమీఫైనల్స్... జూలై 28న ఫైనల్ జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment