సానియా వర్సెస్ షోయబ్‌.. గెలుపెవరిది? | Sania Mirza vs Shoaib Malik in This New Ad, Guess Who Wins | Sakshi
Sakshi News home page

సానియా వర్సెస్ షోయబ్‌.. గెలుపెవరిది?

Published Tue, Mar 15 2016 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

సానియా వర్సెస్ షోయబ్‌.. గెలుపెవరిది?

సానియా వర్సెస్ షోయబ్‌.. గెలుపెవరిది?

ఇప్పుడు అందరి దృష్టి సహజంగానే ఈ నెల 19పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్ టీ20 వరల్డ్‌ కప్‌లో తలపడుతున్నాయి. ఈ మెగా మ్యాచ్‌కు ప్రివ్యూలాంటి ఓ చిన్న వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. భారత టెన్నిస్ సెన్సెషన్ సానియా మీర్జా.. ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌.. ఈ దంపతులిద్దరూ తమ తమ దేశాల గొప్పతనం చెప్తూ.. గొడవపడే ఓ పాకిస్థానీ యాడ్‌ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

హాల్‌లో ఫొటో తగిలించే విషయంలో మొదలయ్యే ఈ వాదులాట ఇరుదేశాలవైపు మళ్లుతుంది. సానియా 'అమృత్‌సర్ లడ్డూలు' అంటే.. కాదు 'ముల్తాన్ కా సోన్ అల్వా' అంటూ షోయబ్ కౌంటర్ ఇస్తాడు. మళ్లీ సానియా 'షిమ్లాకి సర్ది' కావాలంటోంది. లేదు 'ఇస్లామాబాద్‌ కి బారిష్‌' అంటూ షోయబ్ మెలిక పెడతాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వాదులాట సహజంగానే క్రికెట్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. 'సచిన్ స్ట్రయిట్ డ్రైవ్‌' ఇష్టమని సానియా అంటే.. నాకు మాత్రం 'షోయబ్ అఖ్తర్ యార్కర్లు' అంటూ షోయబ్ బదులిస్తాడు. ఇలా పోటాపోటీగా సాగే ఈ వాదులాటలో ఎవరు గెలిచారు? ఈ భార్యాభర్తల గొడవ సామరస్యంగా సద్దుమణిగిందా? అన్నది హల్‌చల్ చేస్తున్న ఈ యాడ్ వీడియోను  చూసి తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement