వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ మరోసారి భారత జట్టుపై తన అక్కసు వెళ్లగక్కాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని మాలిక్ జోస్యం చెప్పాడు.
ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉందని, మరోసారి అదే రిపీట్ అవుతుందని మాలిక్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఏ స్పోర్ట్స్ టీవీ షోలో మాలిక్ మాట్లాడుతూ.. "ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి ఆస్ట్రేలియాకు అన్ని రకాల అర్హతలున్నాయి. వసీం(వసీం అక్రమ్) భాయ్ కూడా అదే చెప్పారు . ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని నాకు నమ్మకం ఉందని" అన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పగటికలకు కనకు.. అక్కడ ఉంది పాకిస్తాన్ కాదు.. టీమిండియా అంటూ నెటిజన్లు మాలిక్‌కు కౌంటిరిస్తున్నారు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
చదవండి: WC 2023 IND Vs AUS Final: 20 ఏళ్ల తర్వాత ఆసీస్‌తో ఫైనల్ పోరు.. టీమిండియా బదులు తీర్చుకుంటుందా?
Comments
Please login to add a commentAdd a comment