అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతులు మిగిలి ఉండగా పాక్ గెలుపొందింది. ఆఖరి ఓవర్‌ను అందుకున్న అఫ్గాన్ పేసర్ అఫ్తాబ్ అలమ్ బౌలింగ్‌లో షోయబ్ మాలిక్ సిక్స్, ఫోర్ కొట్టి పాక్‌కు విజయం ఖాయం చేశాడు. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 10 పరుగులు కావాల్సిన తరుణంలో మాలిక్ సమయోచితంగా ఆడి జట్టును గెలిపిస్తే, తన బౌలింగ్ కారణంగా జట్టు పరాజయం పాలుకావడాన్ని అఫ్తాబ్ అలమ్ జీర్ణించుకోలేపోయాడు. మ్యాచ్ అనంతరం అలమ్ మోకాళ్లపై కూలబడి కన్నీటి పర్యంతమయ్యాడు.
అఫ్గానిస్తాన్ ఆటగాళ్లతో మాలిక్-హసన్ అలీలు కరాచలనం చేసే క్రమంలో అలమ్ తన రెండు చేతుల్ని అడ్డం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో అలమ్‌ను ఓదార్చడం మాలిక్ వంతైంది. కాసేపు గ్రౌండ్‌లో అలమ్ కూర్చుండిపోగా అతని భుజాలపై చేయి వేసి ధైర్యం చెప్పాడు మాలిక్. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాలిక్.. ఇలా ప్రత్యర్థి ఆటగాడ్ని ఓదార్చి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ అజేయంగా నిలిచి 51 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఆ తర్వాత చెమటోడ‍్చిన పాకిస్తాన్ కడవరకూ పోరాడి విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment