
ఇస్లామాబాద్ : ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ ఆటతీరు టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనిని తలపించిందని ఆ జట్టు మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో కడదాక నిలిచిన మాలిక్ హాఫ్ సెంచరీతో పాక్‌కు విజయం అందించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. మూడు బంతుల్లో ఎలాంటి తడబాటు లేకుండా ఒక సిక్స్, ఫోర్ బాది విజయాన్నందించిన మాలిక్‌పై వసీం అక్రమ్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. (చదవండి: ధోని కెప్టెన్సీ.. షకీబ్ బలి)
‘అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని షోయబ్ మాలిక్ అఫ్గానిస్తాన్ మ్యాచ్‌తో మరోసారి నిరూపించాడు. మాలిక్, ధోనిలా ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి చేశాడు. తన ముఖంలో ఎలాంటి హావాభావాలు లేకపోవడంతో అసహనంతో బౌలర్‌కు ఏం చేయాలనో అర్థం కాలేదు. అద్భత బ్యాటింగ్’ అని ట్వీట్ చేశాడు. (చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్..)
Experience has no substitute... Shoaib Malik proved it against a spirited Afghanistan .Did a Dhoni like finish ... when Malik faced a bowler, he had no expression on his face and that frustrates a bowler becos he doesn’t know what to expect... wonderful knock @realshoaibmalik
— Wasim Akram (@wasimakramlive) September 22, 2018
Comments
Please login to add a commentAdd a comment