టెస్టు క్రికెట్‌లో ఇంగ్లంగ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగులు వరదపారిస్తున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.
ముల్తాన్ వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ అదరగొడుతున్నాడు. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న రూట్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
కుక్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు..
టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు. రూట్ ఇప్పటివరకు 147 టెస్టులు ఆడి 12473* పరుగులు చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15921) అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో రికీ పాంటింగ్(13378) పరుగులు చేశాడు.
చదవండి: CT 2025: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment