ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఆ జట్టు వరల్డ్‌కప్ జట్టు సభ్యుడు జో రూట్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో రేపు (సెప్టెంబర్ 20) జరుగబోయే తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు సర్వం సిద్దం చేసుకున్నాడు. ఇందుకోసం అతను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతిని తీసుకున్నాడు. రూట్ గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్‌లో లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఫామ్‌లోకి రావడం కోసం రూట్ పడుతున్న తాపత్రయాన్ని చూసి ఈసీబీ సైతం అతనికి పర్మీషన్‌ను ఇచ్చింది. వరల్డ్‌కప్‌కు ముందు ఫామ్‌లోకి వచ్చేందుకు రూట్‌కు ఇది చాలా ఉపయోగపడుతుందని ఈసీబీ సైతం భావిస్తుంది. కాగా, ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన సభ్యులను ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. రూట్ ప్రస్తుతం పట్టుబట్టి మరీ ఇంగ్లండ్ జట్టులో చేరాడు. కీలకమైన వరల్డ్‌కప్‌కు ముందు ఆటగాళ్లు గాయాలు బారిన పడకూడదని ఈసీబీ ఐర్లాండ్ సిరీస్‌కు తమ మెయిన్ స్ట్రీమ్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు.
ఇదిలా ఉంటే, ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌తో రూట్ చాలాకాలం తర్వాత వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జులైలో సౌతాఫ్రికాతో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన రూట్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రూట్ నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 6 పరుగులు చేసిన రూట్.. ఆతర్వాత రెండో వన్డేలో డకౌట్, మూడో వన్డేలో 4 పరుగులు, నాలుగో వన్డేలో 29 పరుగులు చేసి నిరాశపరిచాడు.
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు.. జాక్ క్రాలే (కెప్టెన్), సామ్ హెయిన్, బెన్ డకెట్, జో రూట్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లూక్ వుడ్, ఫిలిప్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్,జార్జ్ స్క్రిమ్‌షా, టామ్ హార్ట్‌లీ
Comments
Please login to add a commentAdd a comment