ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జోసఫ్ ఎడ్వర్డ్ రూట్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీ (262) చేసిన రూట్.. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 20000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా రికార్డుపుటల్లోకెక్కాడు. రూట్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 350 మ్యాచ్‌లు ఆడి 20079 పరుగులు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి తర్వాత 20000 పరుగులు పూర్తి చేసింది రూట్ ఒక్కడే. విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 535 మ్యాచ్‌లు ఆడి 27041 పరుగులు చేశాడు.
కాగా, పాక్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రూట్ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. సహచురుడు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడ్డాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్
Comments
Please login to add a commentAdd a comment