
Courtesy: IPL
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తొమ్మిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాయల్స్ యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌తో పాటు మరో ఎనిమిది మందిని రిలీజ్ చేసింది. గత సీజన్‌లో ఆడిన స్టార్ ఆటగాళ్లతో పాటు కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించింది. రాజస్థాన్ మేనేజ్‌మెంట్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు ఉన్నారు. జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్‌కాయ్‌లను రాజస్థాన్ మేనేజ్‌మెంట్ వేలానికి వదిలేసింది.
రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే..
- జో రూట్
- జేసన్ హోల్డర్
- ఓబెద్ మెక్‌కాయ్
- అబ్దుల్ బాసిత్
- ఆకాశ్ వశిష్ట్
- కుల్దీప్ యాదవ్
- మురుగన్ అశ్విన్
- కేసీ కరియప్ప
- కేఎం ఆసిఫ్
రాజస్థాన్ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..
- సంజూ శాంసన్ (కెప్టెన్)
- జోస్ బట్లర్
- షిమ్రోన్ హెట్‌మైర్
- యశస్వి జైస్వాల్
- ధృవ్ జురెల్
- రియాన్ పరాగ్
- డొనోవన్ ఫెరియెరా
- కునాల్ రాథోడ్
- రవిచంద్రన్ అశ్విన్
- కుల్దీప్ సేన్
- నవ్‌దీప్ సైనీ
- ప్రసిద్ద్ కృష్ణ
- సందీప్ శర్మ
- ట్రెంట్ బౌల్ట్
- యుజ్వేంద్ర చహల్
- ఆడమ్ జంపా
- ఆవేశ్ ఖాన్ (లక్నో నుంచి ట్రేడింగ్)
Comments
Please login to add a commentAdd a comment