
ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ సామ్సన్‌పై మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సామ్సన్ తాను అవుటయ్యాక అంపైర్‌తో వాగ్వాదం చేశాడు. సామ్సన్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద ఢిల్లీ ఫీల్డర్ షై హోప్ క్యాచ్ తీసుకున్నాడు. క్యాచ్ పట్టిన క్రమంలో షై హోప్ పాదం బౌండరీ లైన్‌ను తాకినట్లు భావించిన సామ్సన్ కొద్దిసేపు మైదానంలో ఉండి అంపైర్‌తో వాదించి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment