జో రూట్‌ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా | Joe Root becomes 1st England batter to score 1000 runs in ODI World Cup | Sakshi
Sakshi News home page

World Cup 2023: జో రూట్‌ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా

Published Sat, Nov 11 2023 9:09 PM | Last Updated on Sat, Nov 11 2023 9:57 PM

Joe Root becomes 1st England batter to score 1000 runs in ODI World Cup - Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిగా రూట్‌ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రూట్‌.. ఈ అరుదైన మైలు రాయిని రూట్‌ అందుకున్నాడు.

రూట్‌ ఇప్పటివరకు వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో 25 ఇన్నింగ్స్‌లలో 1034 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న రూట్‌.. 4 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో రూట్‌ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన రూట్‌.. 248 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌..


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement