
India vs England, 2nd Test: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ భారత గడ్డపై అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌లో అత్యధిక పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో చేరాడు. టీమిండియాతో రెండో టెస్టు సందర్భంగా రూట్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
వైజాగ్ వేదికగా రోహిత్ సేన- ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తలపడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో సోమవారం నాటి నాలుగో రోజు ఆట ఆసక్తికరంగా మారింది.
లక్ష్య ఛేదనలో తడబడుతున్న ఇంగ్లండ్
టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తడబడుతోంది. భోజన విరామ సమయానికి 42.4 ఓవర్లలో 194 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. గెలుపునకు ఇంకా 205 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా గెలవాలంటే ఇంకో నాలుగు వికెట్లు తీస్తే చాలు!!
ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆటలో భాగంగా 30.4 ఓవర్లో రవిచంద్రన్‌అశ్విన్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రూట్.. భారత గడ్డపై వెయ్యి పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌లో ఈ మైలురాయి అందుకున్న ఐదో విదేశీ బ్యాటర్‌గా జో రూట్ చరిత్రకెక్కాడు.
ఇక.. ఈ ఘనత సాధించిన తర్వాత మరొక్క పరుగు చేసిన రూట్(16).. అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక జో రూట్ భారత్‌లో వేదికగానే 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది 1-0తో ఆధిక్యంలో ఉండగా.. వైజాగ్‌లో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
భారత్‌లో వెయ్యి.. అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ బ్యాటర్లు
క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్)- 1359 పరుగులు(సగటు 75.50)
అలిస్టర్ కుక్(ఇంగ్లండ్)- 1235 పరుగులు(సగటు 51.45)
సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్(వెస్టిండీస్)- 1042 పరుగులు (సగటు 45.3)
మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా)- 1027 పరుగులు(సగటు 51.35)
జో రూట్(ఇంగ్లండ్)- 1004 పరుగులు(సగటు 45.59).
చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్!