ఆల్‌టైమ్‌ టాప్‌-10 జాబితాలోకి రూట్‌ | ENG VS WI 1st Test Day 2: Joe Root Moved To 10th Spot In All Time List Of Test Run Scorers | Sakshi
Sakshi News home page

ENG VS WI 1st Test: ఆల్‌టైమ్‌ టాప్‌-10 జాబితాలోకి రూట్‌

Published Thu, Jul 11 2024 8:34 PM | Last Updated on Fri, Jul 12 2024 10:01 AM

ENG VS WI 1st Test Day 2: Joe Root Moved To 10th Spot In All Time List Of Test Run Scorers

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్‌-10 జాబితాలోకి చేరాడు. లార్డ్స్‌ వేదికగా విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన రూట్‌.. ఈ జాబితాలో పదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (15921 పరుగులు) టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్‌ (13378), కల్లిస్‌ (13289), ద్రవిడ్‌ (13288), అలిస్టర్‌ కుక్‌ (12472), సంగక్కర (12400), బ్రియాన్‌ లారా (11953), చంద్రపాల్‌ (11867), జయవర్దనే (11814), రూట్‌ (11804) రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల  సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదుగురు (క్రాలే (76), పోప్‌ (57), రూట్‌ (68), బ్రూక్‌ (50), జేమీ స్మిత్‌ (70)) అర్ద సెంచరీలు సాధించారు.

విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌ 4, జేసన్‌ హోల్డర్‌, గుడకేశ్‌ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ అరంగేట్రం బౌలర్‌ గస్‌ అట్కిన్సన్‌ (7/45) విండీస్‌ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్‌, వోక్స్‌, స్టోక్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో మిఖైల్‌ లూయిస్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement