వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మరో విజయంపై కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంగ్లండ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
"డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఆదివారం అఫ్గానిస్తాన్‌తో పెద్దగా సవాలైతే ఎదురుకాదు. ఢిల్లీలో అఫ్గాన్ స్పిన్నర్లకు పిచ్ నుంచి సానుకూలత లేకపోతే మ్యాచ్ ఏకపక్షమయ్యే ఫలితంలో ఏ మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పొచ్చు. అయితే గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్ బరిలోకి దిగేందుకు, ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది.
ఇంగ్లండ్‌కు ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్‌నెస్ ఎంతో కీలకం. ఏడాది క్రితం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ ఇంగ్లండ్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్ లో పునరాగమనం చేశాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లో అతను ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడని ఇదివరకు ఎన్నో సార్లు రుజువు చేశాడు.
మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆ్రస్టేలియా చిత్తుగా ఓడటం ఇంగ్లండ్ సహా సెమీస్ బరిలో ఉంటామనుకున్న మిగతా జట్ల ఉత్సాహంపై నీళ్లుచల్లింది. ఎందుకంటే ఇంగ్లండ్ కూడా న్యూజిలాండ్ చేతిలో అలాంటి పరాజయాన్నే చవిచూసింది. ఇలాంటి అత్యల్ప స్కోర్ల మ్యాచ్‌లతో నాకౌట్ దశ చేరేందుకు చివరికొచ్చేసరికి రన్‌రేట్ కీలకమవుతుంది.
కాబట్టి సెమీస్‌లో ఎవరూ ఖాయమని అనుకోవడానికి లేదు. అయితే ఇంగ్లండ్... అఫ్గాన్ తదితర జట్లపై భారీ విజయాలపై దృష్టి పెడితే మంచిది. ఢిల్లీ లాంటి పిచ్‌పై ఇంగ్లండ్ బ్యా టర్లు చెలరేగేందుకు చక్కని అవకాశం కలి్పస్తుంది.
చదవండి: విలియమ్సన్‌కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం
Comments
Please login to add a commentAdd a comment