
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా లహోర్ వేదికగా ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది.
గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన బ్రాడైన్ కార్స్ స్ధానంలో తుది జట్టులోకి రెహన్ అహ్మద్ వచ్చాడు. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఇంటిముఖం పడుతోంది. కాగా రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూశాయి.
తుది జట్లు
అఫ్గానిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.
చదవండి: పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment