
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఇవాళ (జూన్ 4) నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తుంది.
కుల్దీప్-వన్షిక ఎంగేజ్‌మెంట్‌కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని కుల్దీప్ త్వరలో ప్రకటించనున్నాడు.
Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).
- Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
కుల్దీప్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆరంభంలో అద్బుత విజయాలు సాధించినా, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 30 ఏళ్ల కుల్దీప్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 7.07 సగటున 15 వికెట్లు తీశాడు. కుల్దీప్ తర్వలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టుకు ఎంపికయ్యాడు.
ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్కడే. అశ్విన్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక కుల్దీప్ భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తే అతనికి తిరుగే ఉండదు. కుల్దీప్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇదివరకే తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ కీలకంగా వ్యవహరించాడు.