బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కాడు. ఓపెనర్ మికైల్ లూయిస్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అలిక్ అథనాజ్ కూడా 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆఖర్లో కీమర్ రోచ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.
రోచ్ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (25), జాషువ డసిల్వ (14), జడెన్ సీల్స్ (18), షమార్ జోసఫ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ బ్రాత్‌వైట్ (4), అల్జరీ జోసఫ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. 144.1 ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మీరాజ్ తలో రెండు.. తైజుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (5), జకీర్ హసన్ (15) ఔట్ కాగా.. మొమినుల్ హాక్ (7), షాహదత్ హొసేన్ దీపు (10) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్‌కు తలో వికెట్ దక్కింది.
కాగా, రెండు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment