
విజయం దిశగా ఆసీస్
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనిస్తోంది.
పెర్త్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనిస్తోంది. టీమిండియా విసిరిన 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దాటిగా బ్యాటింగ్ చేస్తోంది. 40.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 249 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. కెప్టెన్ స్మిత్(113 బ్యాటింగ్ 104 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), బెయిలీ(111 బ్యాటింగ్; 115 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కుదురుగా బ్యాటింగ్ చేస్తూ ఆసీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళుతున్నారు.
అంతకుముందు అరోన్ పించ్(8), డేవిడ్(5) లు అవుటైనా..బెయిలీ-స్మిత్ జోడి 225 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.