Rohit Sharma To Lead Team India In 1000th ODI: ఫిబ్రవరి 6న మోతేరా వేదికగా విండీస్‌తో జరిగే తొలి వన్డే ద్వారా భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించనుంది. క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని 1000వ వన్డే మైలరాయిని భారత్.. ఈ మ్యాచ్‌తో చేరుకోనుంది. ఇప్పటివరకు 999 వన్డేలు ఆడిన భారత్.. విండీస్‌తో మ్యాచ్ ద్వారా సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. 1971 జనవరి 5న ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో మొదలైన వన్డే క్రికెట్ ప్రస్థానంలో భారత్ 999 మ్యాచ్‌ల్లో 518 విజయాలు, 431 పరాజయాలతో 54. 54 విజయాల శాతాన్ని నమోదు చేసింది.
INDIA WILL PLAYING 1000'th ODI MATCH ON 6 FEB AGAINST WEST INDIES ,🇮🇳 THE FIRST NATION TO PLAY 1000 ODI MATCHES https://t.co/a8YO5Z42SA
— Professor 🕊️🇮🇳 (@kingfansays) January 29, 2022
అత్యధిక వన్డేలు ఆడిన దేశాల జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(958), పాకిస్థాన్ (936), శ్రీలంక (870), వెస్టిండీస్ (834), న్యూజిలాండ్ (775), ఇంగ్లండ్ (761), సౌతాఫ్రికా (638), జింబాబ్వే (541), బంగ్లాదేశ్ (388) జట్లు వరుసగా ఉన్నాయి. ఇక గెలుపు శాతం విషయానికి వచ్చేసరికి.. 63.75 శాతం విజయాలతో ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (63.75), భారత్(54. 54) పాక్ (53.98), ఇంగ్లండ్ (53.07) దేశాలు వరుస స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు విండీస్‌తో తొలి వన్డేలో టీమిండియాకు సారధ్యం వహించడం ద్వారా రోహిత్ శర్మ సైతం అరుదైన గౌరవం దక్కించుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు ఆడే చారిత్రక మ్యాచ్‌కు నాయకత్వం వహించే సువర్ణ అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాడు. 1974లో హెడింగ్లే వేదికగా మొదలైన భారత వన్డే క్రికెట్ ప్రస్థానంలో తొలి వన్డేకు అజిత్ వాడేకర్, 300వ వన్డేకు సచిన్, 500వ వన్డేకు గంగూలీ, 700, 800, 900వ వన్డేలకు ధోని నాయకులుగా వ్యవహరించారు.
చదవండి: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం
Comments
Please login to add a commentAdd a comment