
ఆసీస్ కు రోహిత్, కోహ్లిల పరీక్ష
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది.
పెర్త్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా 32.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 163 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్షగా నిలిచారు. రోహిత్(90 బ్యాటింగ్;106 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి(56 బ్యాటింగ్; 64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్ లో ఉన్నారు.
టీమిండియా స్కోరు 36 పరుగుల వద్ద శిఖర్ ధవన్ ను తొలి వికెట్ రూపంలో కోల్పోయినా.... విరాట్, రోహిత్ లు కుదురుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళుతున్నారు. పేస్ కు స్వర్గధామమైన పెర్త్ లో విరాట్-రోహిత్ ల జోడి మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, చెత్త బంతులను బౌండరీలు దాటిస్తున్నారు.