
రోహిత్ అదుర్స్..
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు.
పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. 122 బంతుల్లో ఏడు ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో శతకాన్ని సాధించాడు. దీంతో వన్డే కెరీర్ లో తొమ్మిదో సెంచరీ సాధించిన రోహిత్.. పెర్త్ లో శతకం నమోదు చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. అంతకుముందు ఇదే స్టేడియంలో జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. ఆస్ట్రేలియాలో మూడో వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
అతనికి జతగా విరాట్ కోహ్లి(75 బ్యాటింగ్) కూడా రాణించడంతో టీమిండియా 38.0ఓవర్లలో వికెట్ నష్టానికి 196 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా ఆదిలోనే శిఖర్ ధవన్(9) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత ఈ జోడీ రెండో వికెట్ కు 186 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.