బులవాయో: ఓపెనర్ ఇమాముల్ హక్ (134 బంతుల్లో 128; 11 ఫోర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వేతో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 201 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఇమాముల్‌తో పాటు ఫఖర్ జమాన్ (60; 7 ఫోర్లు), ఆసిఫ్ అలీ (46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో జింబాబ్వే 107 పరుగులకే ఆలౌటైంది. ర్యాన్ ముర్రే (32 నాటౌట్) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, ఉస్మాన్, ఫహీం రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇమాముల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరుగనుంది.
పాక్ ఘనవిజయం
Published Sat, Jul 14 2018 1:37 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment