
ప్రావిడెన్స్ (గయానా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంలో ఆటను 43 ఓవర్లకు కుదిరించారు. కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. 299 వన్డే ఆడుతున్న విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ విండీస్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన బ్రియన్ లారా రికార్డును సమం చేశాడు.
జట్లు
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్: జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, ఎల్విన్ లూయిస్, షాయ్ హోప్, హేట్‌మేయర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, ఫాబియన్ అలెన్, కార్లొస్ బ్రాత్‌వైట్, కీమర్ రోచ్, షెల్డన్ కాట్రేల్